Jio 195 Cricket Plan Validity Reduced: ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతున్న వేళ, రిలయన్స్ జియో తన పాపులర్ రూ. 195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది.
గతంలో ఎక్కువ కాలం అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని భారీగా తగ్గిస్తూ జియో నిర్ణయం తీసుకుంది.
Read Also:Nikhat Zareen: ఆసియా బాక్సింగ్‌లో సెమీస్‌కు నిఖత్ జరీన్..
ఏమిటీ మార్పు?
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డేటా ప్యాక్ వ్యాలిడిటీలో జియో కీలక మార్పులు చేసింది.గతంలో ఈ ప్లాన్ 90 రోజుల పాటు అందుబాటులో ఉండేది.ఇప్పుడు దీనిని కేవలం 30 రోజులకు పరిమితం చేశారు.తక్కువ ధరకే ఎక్కువ రోజులు డేటా, సబ్‌స్క్రిప్షన్ వాడాలనుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఇది భారంగా మారింది.
Reliance Jio Cricket Plan 195 Update
Jio 195 Cricket Plan Validity Reduced: ప్లాన్ ప్రయోజనాలు (యథావిధిగా)
వ్యాలిడిటీ తగ్గినా, మిగిలిన ప్రయోజనాల్లో జియో ఎలాంటి మార్పులు చేయలేదు.ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు 15GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా జియోహాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం యథావిధిగా అందుతుంది.జియో టీవీ, జియో సినిమా వంటి ఇతర యాప్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది.
వినియోగదారుల స్పందన
మెగా టోర్నీ ఐపీఎల్ 2026 జరుగుతున్న సమయంలో ఇలా వ్యాలిడిటీ తగ్గించడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే పూర్తి సీజన్ కవర్ అయ్యేదని, ఇప్పుడు ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సి రావడం వల్ల ఖర్చు పెరుగుతుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

