Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొబైల్ అలక ప్రాణం తీసింది

మొబైల్ అలక ప్రాణం తీసింది

వార్త 2 months ago

Mahabubabad Crime: మహబూబాబాద్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన వెలుగుచూసింది. కేవలం కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వడానికి తండ్రి వద్ద డబ్బులు లేవని చెప్పినందుకు ఒక యువతి క్షణికావేశంలో బావిలో దూకి ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన స్థానిక గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బిందు (22) అనే యువతి వద్ద ఉన్న పాత సెల్ ఫోన్ గత కొన్ని రోజులుగా సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో ఆమె తనకు కొత్త సెల్ ఫోన్ కొనివ్వాలంటూ తన తండ్రిని కోరింది.

Read Also: Palamuru University student: హాస్టల్ గదిలో ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య!

Mahabubabad Crime

Mahabubabad Crime : తండ్రి నిస్సహాయత.. కూతురి ఘాతుకం

కూతురి కోరిక విన్న తండ్రి, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడు మొబైల్ కొనివ్వలేనని నిస్సహాయత వ్యక్తం చేశాడు. తండ్రి సమాధానంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిందు, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. జీవితంపై విరక్తితో గ్రామ శివార్లలోని ఒక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

అరేయ్ మీరేం స్నేహితులురా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంతకు తెగిస్తారా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha