Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: డీకే అరుణ

మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: డీకే అరుణ

వార్త 1 day ago

DK Aruna: ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన లీడర్‌షిప్‌లో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై విశేషమైన ఖ్యాతిని గడించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశంసించారు.

రాబోయే 2047 సంవత్సరం నాటికి దేశాన్ని సంపూర్ణ ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు.

 Indian Economy 4th Largest

మహిళా సాధికారత.. రైతు సంక్షేమమే కేంద్రం అజెండా

మహిళల ఆర్థిక స్వావలంబన, రైతుల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డీకే అరుణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “రాబోయే 2030 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్‌పతి, క్రోర్‌పతి దీదీలు’గా మార్చడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు దేశంలోని కోట్లాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి” అని ఆమె పేర్కొన్నారు.

Read also: Singareni Collieries: సింగరేణికి కేంద్రం శుభవార్త

DK Aruna: ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయాల వల్లే భారత్ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని అరుణ కొనియాడారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని కేంద్రం ఉక్కుపాదంతో అణచివేసిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పులతో పాటు.. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి భారీ కార్యక్రమాలు దేశ రూపురేఖలను మార్చేశాయని వివరించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న మోదీ మార్క్ పాలన సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ఆమె స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

read also:

హైదరాబాద్ అసెంబ్లీ వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్లాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha