Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీ పై ట్రంప్ ప్రశంసలు

మోదీ పై ట్రంప్ ప్రశంసలు

వార్త 2 weeks ago

Modi - Trump : అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి, వ్యక్తిత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫిదా అయ్యారు.

తాను అమెరికా అధ్యక్షుడిగా అధికారంలో ఉన్నంత కాలం భారతదేశానికి వైట్‌హౌస్‌లో ఒక అత్యంత నమ్మకమైన, గొప్ప స్నేహితుడు ఉంటాడని ట్రంప్ సగర్వంగా ప్రకటించారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తారని, అలాగే పీఎం మోదీపై ఇక్కడి నాయకులకు, ప్రజలకు అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. మోదీని ఒక అద్భుతమైన వ్యక్తిత్వంతో పోలుస్తూ.. ఆయన చూడటానికి ఒక 'ఏంజెల్' (దేవదూత) లాగా చాలా ప్రశాంతంగా, అందంగా కనిపిస్తారని ట్రంప్ కొనియాడారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ దౌత్య వర్గాలలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also : భారత్‌కు అమెరికా భారీ షాక్.. 'ఇండో పసిఫిక్' పేరు మారుస్తూ సంచలన నిర్ణయం!

'టఫ్ నెగోషియేటర్.. కిల్లర్ లాంటి వ్యక్తి': మోదీ రాజతంత్రాన్ని విశ్లేషించిన ట్రంప్

నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల విషయంలో ఎంత కఠినంగా ఉంటారో డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విశ్లేషించారు. మోదీ పైకి శాంతంగా కనిపించినప్పటికీ, ద్వైపాక్షిక చర్చలు లేదా ఒప్పందాల విషయానికి వస్తే మాత్రం అత్యంత కఠినమైన వ్యక్తిగా (టఫ్ నెగోషియేటర్) మారిపోతారని, ఆ సమయంలో ఆయన ఒక 'కిల్లర్' లాగా వ్యవహరిస్తారని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “తన వ్యూహాలతో మోదీ మిమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తారు.. ప్రపంచంలో ఇలాంటి అరుదైన నాయకులు కొద్దిమంది మాత్రమే ఉంటారు” అని ప్రశంసించారు. సాధారణంగా ప్రజలు మోదీని చాలా మంచి మనిషి అని అంటారని, కానీ ఒక దేశాధినేతగా ఆయన ఎంత దృఢమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరో తనకు బాగా తెలుసని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాల పటిష్టతకు మోదీ లాంటి బలమైన నాయకత్వం ఎంతో అవసరమని ట్రంప్ మాటలను బట్టి స్పష్టమవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha