పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సాధారణ కిరాణా షాపులో ఆగి, స్థానిక చిరుతిండి 'ఝలమురి' (Jhalmuri) రుచి చూడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
మోదీ ఝలమురి తింటున్న వీడియో బయటకు వచ్చిన వెంటనే, అసలు ఈ వంటకం ఏంటి? దీన్ని ఎలా చేస్తారు? అని తెలుసుకోవడానికి నెటిజన్లు పోటీ పడ్డారు. ఫలితంగా గూగుల్ సెర్చ్ హిస్టరీలోనే గత 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ‘Jhalmuri’ అనే పదం కోసం సెర్చ్‌లు గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రధాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 100 మిలియన్ల (10 కోట్లు) వ్యూస్ దాటడం ఆయనకున్న క్రేజ్‌కు నిదర్శనం. దీంతో “మోదీ ట్రెండ్ సెట్టర్ కాదు.. ఆయనే ఒక ట్రెండ్” అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Read Also : KCR: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే - కేసీఆర్ ధీమా

ఏంటి ఈ ఝలమురి? దీని ప్రత్యేకత ఏంటి?
ఝలమురి అంటే బెంగాలీ భాషలో ‘ఝల్’ అంటే కారం, ‘మురి’ అంటే మరమరాలు (బొరుగులు) అని అర్థం. ఇది మన దగ్గర దొరికే పిడత కింద పప్పు లేదా బొరుగుల మిశ్రమం (Bhel Puri) లాంటిదే. దీనిలో ప్రధానంగా మరమరాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వేయించిన పల్లీలు, నిమ్మరసం మరియు ఘాటైన ఆవ నూనెను ఉపయోగిస్తారు. అన్నింటికీ మించి దీనిలో వేసే ప్రత్యేకమైన ‘ఝలమురి మసాలా’ దీనికి విభిన్నమైన రుచిని ఇస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో, నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ స్నాక్ ఇప్పుడు దేశంలోని ప్రముఖ నగరాల్లోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.
లోకల్ వోకల్: స్థానిక ఆహారానికి గ్లోబల్ గుర్తింపు
ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పే ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదానికి ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఒక దేశ ప్రధాని సామాన్యుడిలా రోడ్డు పక్కన దొరికే వంటకాన్ని ఆస్వాదించడం వల్ల ఆ వంటకానికి ఉన్న విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనివల్ల బెంగాల్‌లోని వీధి వ్యాపారులకు మరియు ఝలమురి అమ్మే చిన్న చిన్న దుకాణదారులకు మంచి ఆదాయం లభిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సెలబ్రిటీల ప్రభావం (Influencer power) సామాన్య వ్యాపారులకు ఎలా మేలు చేస్తుందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

