Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీతో ఫోటోల కోసం పోటీ పడ్డ ప్రతినిధులు

మోదీతో ఫోటోల కోసం పోటీ పడ్డ ప్రతినిధులు

వార్త 3 weeks ago

BRICS Summit 2026 : న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ (BRICS) బిజినెస్ ఫోరమ్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అంతర్జాతీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులతో నిండిపోయిన ఆ ప్రాంగణంలో మోదీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. దౌత్యపరమైన చర్చలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే వాతావరణంలో ఒక్కసారిగా సరదా ఘట్టం చోటు చేసుకుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ ప్రధాని మోదీతో ఫోటోలు దిగేందుకు విపరీతంగా పోటీ పడ్డారు. బిజినెస్ ఫోరమ్ ప్రాంగణంలో ప్రధాని మోదీ ఉన్న సమయంలో పలువురు విదేశీ ప్రతినిధులు ఆయన వద్దకు వచ్చారు. “సార్.. మీతో ఒక ఫోటో దిగొచ్చా?” అని ఎంతో ఆసక్తిగా అడిగారు.

Read Also: BRICS 2026: ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకుని నడిచిన ప్రధాని మోదీ..ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఫొటో!

 BRICS Summit 2026

BRICS Summit 2026 : మోదీ చుట్టూ విదేశీ డెలిగేట్స్

దానికి ప్రధాని మోదీ కూడా ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ “ఖచ్చితంగా, రండి” అని సమాధానమిచ్చారు. దీంతో మోదీ చుట్టూ విదేశీ డెలిగేట్స్ అంతా ఒక్కసారిగా గుమిగూడారు. మోదీ గ్లోబల్ పాపులారిటీకి ఈ సన్నివేశం అద్దం పట్టింది. దారి ఇచ్చిన పుతిన్, పెజెష్కియాన్! ఈ అరుదైన దృశ్యం జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది. డెలిగేట్స్ అంతా ప్రధాని మోదీ చుట్టూ గుమిగూడుతుండటంతో.. అక్కడే ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లతో పాటు ఇతర కీలక నేతలు వారికి దారి ఇస్తూ పక్కకు తప్పుకున్నారు. విదేశీ ప్రతినిధులకు మోదీతో ఫోటో దిగేందుకు వీలుగా వారు స్పందించిన తీరు సదస్సులో ప్రత్యేకంగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha