Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొటిమలు తగ్గడానికి టూత్‌పేస్ట్‌ వాడొచ్చా?

మొటిమలు తగ్గడానికి టూత్‌పేస్ట్‌ వాడొచ్చా?

వార్త 2 weeks ago

Natural beauty tips: చాలా మంది ముఖం మీద మొటిమ కనిపించగానే కంగారు పడిపోతుంటారు. అది వెంటనే తగ్గిపోవాలని ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్‌ను దానిపై రాస్తుంటారు.

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని చిట్కాలను చూసి ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడం మాట పక్కన పెడితే, చర్మం ఎర్రగా కందిపోతుంది. టూత్‌పేస్ట్‌ను పళ్లను శుభ్రం చేయడానికి తయారు చేస్తారు కానీ సున్నితమైన ముఖ చర్మం కోసం కాదు. దీనివల్ల చర్మంపై మంట రావడమే కాకుండా శాశ్వతమైన నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Read also: Maternity Healthcare : పెరుగుతున్న ప్రసూతి ఖర్చులు

 Best natural tips for pimples cure

Natural beauty tips: పేస్ట్ వాడితే ముఖం ఎందుకు పాడవుతుంది?

టూత్‌పేస్ట్‌లో ఉండే బేకింగ్ సోడా, మెంతాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు మొటిమను త్వరగా ఎండబెట్టినట్లు అనిపిస్తాయి. అయితే ఇవి చర్మం సహజంగా ఉండాల్సిన పీహెచ్ (pH) స్థాయిని పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల స్కిన్ విపరీతంగా పొడిబారిపోయి ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. పాత కాలంలో పేస్ట్‌లో ‘ట్రైక్లోసన్’ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉండేది, అందుకే అప్పుడు ఈ చిట్కా పని చేసేది. కానీ ఇప్పుడు వచ్చే పేస్ట్‌లలో అది ఉండదు, కాబట్టి వీటిని వాడటం వల్ల చర్మం కాలిపోయినట్లు అవుతుంది.

మొటిమలు మటుమాయం చేసే సహజ చిట్కాలు

మొటిమల సమస్య నుండి బయటపడటానికి వంటింట్లో ఉండే సురక్షితమైన పదార్థాలను వాడటం ఉత్తమం. ఖరీదైన క్రీముల కంటే ఇంట్లో దొరికే వేప, కలబంద వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. మీ కోసం కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి

  • వేపాకులను మెత్తగా నూరి కొంచెం పసుపు కలిపి రాస్తే మొటిమల్లోని బ్యాక్టీరియా నశిస్తుంది.
  • కలబంద జెల్ రాయడం వల్ల చర్మానికి చల్లదనం లభించి వాపు, నొప్పి తగ్గుతాయి.
  • టీ ట్రీ ఆయిల్ ను కొబ్బరి నూనెతో కలిపి వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • మొటిమలు పెద్దవిగా ఉంటే ఐస్ ముక్కను పల్చటి బట్టలో చుట్టి కాపడం పెట్టండి.
  • రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగడం వల్ల బాడీలోని మలినాలు పోయి చర్మం మెరుస్తుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha