Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మౌని రాయ్ విడాకులు.. దిశా పటానీయే కారణమా?

మౌని రాయ్ విడాకులు.. దిశా పటానీయే కారణమా?

వార్త 1 week ago

Mouni Roy Suraj Nambiar Divorce: బాలీవుడ్ టెలివిజన్ అండ్ సిల్వర్ స్క్రీన్ పాపులర్ నటి మౌని రాయ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. గత కొన్ని రోజులుగా భర్త సూరజ్ నంబియార్తో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, తాము విడిపోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో మొదలైన వదంతులపై ఈ జంట ఒక సంయుక్త ప్రకటన (Joint Statement) ద్వారా క్లారిటీ ఇచ్చింది.

Read Also: Veerabhadrudu Telugu Movie Review: లాయర్ అవతారంలో సూర్య మెప్పించాడా?

మా వ్యక్తిగత ప్రాధాన్యతలలో వచ్చిన మార్పుల కారణంగా, మేము పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఈ కష్ట సమయంలో దయచేసి మా గోప్యతను (Privacy) గౌరవించండి. ఎలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దు." అని వారు నెటిజన్లను అభ్యర్థించారు.

Mouni Roy Suraj Nambiar Divorce: మధ్యలోకి దిశా పటానీ.. నెటిజన్ల ట్రోలింగ్!

విడాకుల ప్రకటన వచ్చిన వెంటనే నెటిజన్లు మౌని రాయ్ బెస్ట్ ఫ్రెండ్, నటి దిశా పటానీని ఈ వివాదంలోకి లాగడం మొదలుపెట్టారు. మౌని, దిశాలు ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వారు తరచూ కలిసి ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తుంటారు. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఈ జంట విడిపోవడానికి దిశా పటానీయే కారణమంటూ నెటిజన్లు అత్యంత దారుణమైన కామెంట్స్ చేయడం ప్రారంభించారు. వారి స్నేహంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆరోపణలు చేశారు.

తన విడాకుల పోస్ట్‌కు సంబంధించిన కామెంట్ సెక్షన్‌ను, మౌని రాయ్ ఆఫ్ (Turn Off) చేశారు. అయినప్పటికీ కొందరు నెటిజన్లు ఆగకుండా మౌని రాయ్ పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల వద్దకు వెళ్లి దిశాకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతుండటం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.సమస్య ఏదైనా, ఒక సెలబ్రిటీ జంట వ్యక్తిగత కారణాలతో విడిపోతుంటే.. దానికి వేరొకరిని బాధ్యులను చేస్తూ సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం నెటిజన్ల వికృత రూపానికి అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పెద్ది నుంచి 'రాంబుజ్జి' ఎంట్రీ.. మరో గ్లింప్స్ వీడియో విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha