Supriya Sule Traffic Jam Video: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
మహారాష్ట్ర దినోత్సవ సెలవు దినం కావడంతో పర్యాటకులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడం దీనికి ప్రధాన కారణం.
Read Also:India GST Collections: GST కలెక్షన్లలో ఇండియా సరికొత్త రికార్డు!
Supriya Sule Traffic Jam Video: సుప్రియా సూలే వైరల్ వీడియో
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచే లోనావాలా, ఖండాలా ఘాట్ సెక్షన్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గూగుల్ మ్యాప్స్ వంటి లైవ్ మ్యాప్‌లలో ఈ మార్గమంతా ఎరుపు రంగులోకి మారిపోయింది.మహారాష్ట్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్న ఎంపీ సుప్రియా సూలే సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. కారు కదలకపోవడంతో ఆమె కిందకు దిగి ఇతర ప్రయాణికులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు గంటలుగా ఇక్కడే ఉన్నామని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
కమర్షియల్ గ్యాస్ ధరలపై రాహుల్ గాంధీ ఫైర్

