Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మృగశిర కార్తె వేళ 130 నుండి రూ.250కి పెరిగిన చేపల ధరలు

మృగశిర కార్తె వేళ 130 నుండి రూ.250కి పెరిగిన చేపల ధరలు

వార్త 6 days ago

Mrugasira karthi: మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్ నగరం చేపల భోజన ప్రియుల సందడితో నిండిపోయింది. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద ఆదివారం, సోమవారం భారీగా జనం తరలివచ్చారు.

రాంనగర్ చౌరస్తా నుండి దాయారా మార్కెట్ రోడ్డు వరకు చేపల విక్రయాలు చాలా వేగంగా జరిగాయి. నగరవాసులు కార్తె పర్వదినాన్ని పురస్కరించుకుని చేపలను తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఈ కారణంగా మార్కెట్ అంతా పండుగ వాతావరణం కనిపించింది.

Read also: Bathini Fish Prasadam: 176 ఏళ్ల చారిత్రాత్మక సంప్రదాయం..హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

 A scene at the fish market during the Mrigashira Karte season.

పెరిగిన చేపల ధరలు

మృగశిర కార్తె ప్రభావంతో చేపలకు గిరాకీ పెరిగి, ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజుల్లో కిలో రవ్వ, బొచ్చె చేపల ధర 120 నుంచి 130 రూపాయలు ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ధర 230 నుండి 250 రూపాయలకు చేరింది. అదేవిధంగా, ఎంతో రుచిగా ఉండే కొరమీను చేప ధర 450 రూపాయల నుండి 650 రూపాయలకు పెరిగింది. అయినా, చేపల ప్రియులు ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

Mrugasira karthi: కిక్కిరిసిన చేపల మార్కెట్

ముషీరాబాద్ ప్రాంతంలో చేపల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. ప్రజల రాకతో రోడ్లన్నీ వాహనాల రద్దీతో నిండిపోయి, మార్కెట్ ప్రాంతం కిటకిటలాడింది. మృగశిర కార్తె రోజున చేపలు తింటే వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఈ నమ్మకంతో ప్రతి ఒక్కరూ చేపల కోసం మార్కెట్‌కు క్యూ కట్టారు. వ్యాపారులు కూడా ఈ సీజన్ అమ్మకాలతో భారీగా లాభాలను అందుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఈ ఏడాది కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజుల మోత తప్పదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha