Madhya Pradesh Floods: దేశంలోని మూడు ప్రముఖ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపం దాల్చాయి.
పలు గ్రామాలు, పట్టణాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
Read Also: Royal Cobra: జనావాసంలోకి భారీ రాచనాగు: గాయపడిన పాముకు వైద్యం చేసిన స్థానికులు!
Rains wreak havoc across three states… cities inundated!
Madhya Pradesh Floods: ప్రమాదకర స్థాయిలో జగబుడి, అరుణావతి నదులు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో నదుల ఉధృతి ఆందోళనకరంగా మారింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ప్రవహించే జగబుడి నది ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో అరుణావతి నది సైతం ఉప్పొంగి ప్రమాదకర స్థాయికి చేరింది. నది ఉధృతికి పరిసర గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగాయి. గుజరాత్‌లోనూ పలు జిల్లాల్లో ఇదే విధమైన వరద పరిస్థితి నెలకొంది.
వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ప్రభావిత జిల్లాల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
Epaper: epaper.vaartha.com

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. పాలిగ్రాఫ్ టెస్టుకు నిరాకరించిన సియా, చేతన్

