Thalliki Vandanam Funds: ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన ఈ నిధులను మరో మూడు రోజుల్లో అర్హులైన మిగిలిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ విడతలో ప్రధానంగా లబ్ధి చేకూరనుంది.
Read Also : September rains: సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువ.. ఎండలు ఎక్కువ
‘Thalliki Vandanam’ funds to be credited to accounts in three days!
Thalliki Vandanam Funds: సాంకేతిక కారణాలతో ఆలస్యం..
వాస్తవానికి ఈ విడత నిధులను ఆగస్టు 30వ తేదీనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రక్రియ వాయిదా పడటంతో అధికారులు పునఃసమీక్ష చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అర్హులైన లబ్ధిదారుల తాజా జాబితాలను అధికారులు వేగంగా స్వీకరిస్తున్నారు. ఈ జాబితాల తుది పరిశీలన పూర్తయిన వెంటనే ఆర్థిక శాఖ నేరుగా ‘డిబిటి’ (Direct Benefit Transfer) ద్వారా తల్లుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనుంది.
2.80 లక్షల మందికి లబ్ధి.. గతంలో రాని వారికి కూడా ఛాన్స్
ఈ దఫాలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనుంది. ఇదివరకు అర్హత ఉండి కూడా సాంకేతిక లోపాలు లేదా ఇతర కారణాల వల్ల నిధులు పొందలేకపోయిన లబ్ధిదారులకు సైతం ఈ విడతలోనే నగదు జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొగల్తూరు ప్రజావేదికలో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

