Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడురోజులుగా గాలిస్తున్నా ఇంకా లభించని నూకరాజు కుటుంబ సభ్యుల ఆచూకీ

మూడురోజులుగా గాలిస్తున్నా ఇంకా లభించని నూకరాజు కుటుంబ సభ్యుల ఆచూకీ

వార్త 1 month ago

Nookaraju Suicide Case : గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ (Assistant Engineer) నూకరాజు కుటుంబ ఘోర ఉదంతంలో ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన పైనుంచి కుటుంబమంతా దూకగా, పదేళ్ల కుమారుడు కార్తికేయరెడ్డి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి మత్స్యకారుల సాయంతో ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన మీనా, సౌజన్యల మృతదేహాల కోసం 15 మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందంతో పాటు, 10 మంది స్థానిక మత్స్యకారులు బోట్లతో రెండ్రోజులుగా గాలిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫైర్ సిబ్బంది నదిలో విస్తృతంగా శోధిస్తున్నప్పటికీ వారి ఆచూకీ ఇంకా లభించలేదు.

Read Also: Bengaluru Crime: ప్రియుడి కోసం దారుణం.. భర్తను, 4 ఏళ్ల కొడుకును చంపిన మహిళ!

 Nookaraju Suicide Case

Nookaraju Suicide Case : మృతదేహ భద్రత & పోస్టుమార్టం

ఇప్పటికే నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తి చేశారు. అయితే, ఆచూకీ లేని ఆయన భార్య, కుమార్తెల వివరాలు తెలిసిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేస్తామని బంధువులు కోరడంతో, మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోనే భద్రపరిచారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ కుమార్తె సౌజన్య ద్విచక్ర వాహనంలో జిల్లా ఎస్పీకి ఉద్దేశించి రాసిన మూడు సీల్డ్ లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ తన చుట్టూ ఉచ్చు పన్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆ లేఖల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో కారులో దొరికిన ఫోన్ల నుండి వాట్సప్ మెసేజ్‌లను తొలగించినట్లు గుర్తించారు. నిజనిజాలను వెలికితీసేందుకు, సాధిక్ ఖాన్ కాల్ డేటా మరియు వేధింపుల తీవ్రతను స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు (FSL) పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడిన బాలుడు కార్తికేయరెడ్డి సాయంతో, నూకరాజు కుటుంబం ఆఖరి నిమిషాల్లో ప్రయాణించిన ప్రాంతాలను పోలీసులు సందర్శిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.

Epaper: epaper.vaartha.com

జమ్మూ-కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha