Bengaluru Crime: వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన భర్తను, ఆ దారుణాన్ని కళ్లారా చూశాడనే కారణంతో నాలుగేళ్ల కన్న కొడుకును కూడా అతికిరాతకంగా హత్య చేసింది.
అనంతరం సహజ మరణంగా, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, చివరకు పోలీసులకు చిక్కింది. మానవత్వానికే మాయని మచ్చలాంటి ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది.
చిక్కబనవరకు చెందిన అభినందన్ (35), హరిణి (26) భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమారుడు యదువీర్ ఉన్నాడు. కనకపుర తాలూకా హారోహళ్లికి చెందిన ప్రయివేట్ ఉద్యోగి వినయ్‌తో హరిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త అభినందన్ భార్యను పలుమార్లు మందలించాడు. ప్రవర్తన మార్చుకోకపోతే విడాకులు ఇస్తానని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాకపోగా, భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి దారుణ పథకం రచించింది.
Read Also: Medico Priyanka Case: మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు రెండు రోజుల పోలీస్ కస్టడీ
Atrocity for the sake of a lover: Woman kills husband and 4-year-old son.
Bengaluru Crime: నిద్రపోయాక దారుణం.. చిన్నారినీ వదల్లేదు!
ఆదివారం రాత్రి అభినందన్ నిద్రపోయిన అనంతరం హరిణి తన ప్రియుడు వినయ్‌ను ఇంటికి రప్పించింది. పథకం ప్రకారం హరిణి భర్త కాళ్లను పట్టుకోగా, వినయ్ అతడి తలపై కుక్కర్‌తో బలంగా కొట్టి, ఆపై గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ పెనుగులాటలో తండ్రి అరుపులు విని నాలుగేళ్ల కుమారుడు యదువీర్ అక్కడకు వచ్చాడు. తాము చేసిన నేరాన్ని చిన్నారి చూశాడని, బయటపెడితే దొరికిపోతామని భావించిన ఇద్దరూ కలిసి ఆ చిన్నారి గొంతు నులిమి ప్రాణాలు తీశారు.
సీసీటీవీ ఆఫ్ చేసి నాటకం.. పోలీసుల విచారణలో వెలుగులోకి
హత్యల అనంతరం రక్తం మరకలు ఉన్న దుస్తులను మార్చి, భర్త గుండెలపై కుమారుడ్ని నిద్రపుచ్చారు. భర్తే కొడుకును చంపి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. పథకం ప్రకారం ఇంటిలోని సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేసి, వినయ్ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఆన్ చేశారు.
సోమవారం ఉదయం 7 గంటలకు ఏమీ తెలియనట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి, తన భర్త, కుమారుడు మంచంపై స్పృహలేకుండా పడి ఉన్నారని, ఊపిరాడక చనిపోయి ఉంటారని హరిణి కట్టుకథ అల్లింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువుల అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ఇద్దరినీ దారుణంగా హత్య చేసిన హరిణి, ఆమె ప్రియుడు వినయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Epaper: epaper.vaartha.com

