Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగ్గురు మంత్రులు ఉండి పని చేయలేకపోతున్నారు.. పువ్వాడ ఘాటు విమర్శలు

ముగ్గురు మంత్రులు ఉండి పని చేయలేకపోతున్నారు.. పువ్వాడ ఘాటు విమర్శలు

వార్త 2 weeks ago

Khammam : ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బుధవారం ఖమ్మంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గతంలో తాను ఒక్కడినే మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని, కానీ నేడు ముగ్గురు మంత్రులు ఉన్నా ఆ స్థాయిలో పని చేయలేకపోతున్నారని ఘాటుగా విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం నగరం సమగ్రాభివృద్ధి సాధించిందని, నేడు ఆ అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని ఆరోపించారు.

రైతాంగ సమస్యలు - సీతారామ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దన్నుగా నిలిచే సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందిస్తే రైతాంగానికి మేలు జరుగుతుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వారి ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పక్కనబెట్టి కాలయాపన చేయడం వల్ల జిల్లా ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం ఏం చేయబోతోంది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha