Prateek Yadav: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం ఉదయం లక్నోలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.దీంతో సమాజ్ వాది పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి.కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ప్రతీక్, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో చికిత్స తీసుకుంటున్నారు.
Read Also:Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Prateek Yadav: శరీరంలో ఏం జరిగింది? వైద్యుల విశ్లేషణ
ఈ క్రమంలో ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.బుధవారం ఉదయం 6:15 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ప్రతీక్‌ను లక్నో సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రతీక్ యాదవ్ భార్యతో విభేదాల నేపథ్యంలో ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, ప్రతీక్ యాదవ్ మరణానికి 'భారీ పల్మనరీ థ్రోంబోఎంబోలిజం' (Pulmonary Thromboembolism) ప్రధాన కారణమని తేలింది.ఊపిరితిత్తులలోని రక్తనాళాల్లో పెద్ద ఎత్తున రక్తం గడ్డకట్టడం (Clots) వల్ల శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలింది.దీని ప్రభావంతో ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ నిలిచిపోయి, వెనువెంటనే గుండె విఫలమవడంతో (Cardiac Arrest) మృతి సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Prateek Yadav Death
పోస్ట్‌మార్టం నివేదికలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ యాదవ్ శరీరంపై కొన్ని గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఈ గాయాలు మరణానికి ముందే సంభవించినట్లు పేర్కొన్నారు. కానీ ఆ గాయాల స్వభావం ఎలాంటిది? అవి మరణానికి దారితీసేంత తీవ్రమైనవా? కాదా? అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

