Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల బాలికపై మామయ్య, తండ్రి అత్యాచారం

ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల బాలికపై మామయ్య, తండ్రి అత్యాచారం

వార్త 1 month ago

UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. సొంత తండ్రి, మామ కలిసి ఓ 14 ఏళ్ల బాలికపై నిరంతరం అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

గత నాలుగు నెలలుగా ఈ దారుణాలు సాగుతున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తట్టుకోలేక ఆమె ఇంటి నుంచి బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది.

Read also: Kamareddy car accident: పెళ్లి కార్యక్రమం ముగించుకొని వస్తుండగా కారు బోల్తా: ఆరుగురికి గాయాలు

 Police arrest accused in UP minor case

UP Crime: పోక్సో చట్టం కింద నిందితుల అరెస్ట్

హింసను భరించలేక బాలిక ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తనపై జరిగిన అమానవీయ ఘటనలను ఆ బాలిక పోలీసులకు వివరించింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక తండ్రిని, ఆమె మామను వెంటనే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వరంగల్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha