Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరంగల్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

వరంగల్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

వార్త 1 month ago

Warangal Road Accident: వరంగల్ జిల్లా మామునూరు మండలం నక్కలపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్ ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ధాటికి బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మరణించాడు.

Read also: Jagitial News: ఆస్తి కోసం కోడలి మృతదేహానికి అత్తింట్లోనే గుంత!

 Bike fire accident in Warangal Mamnoor

Warangal Road Accident: పేలిన పెట్రోల్ ట్యాంక్.. బైక్ దగ్ధం

ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన తాపీ మేస్త్రీలుగా పోలీసులు గుర్తించారు. వీరు నెక్కొండ వైపు పనుల కోసం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

ఘటనా స్థలంలో విషాద ఛాయలు

బైక్ మంటల్లో కాలిపోవడం, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్.. నలుగురు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha