Billionaire Families : దేశంలో సంపన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. గత రెంగడు సంవత్సరాల్లో ధనవంత కుటుంబాల ఆదాయం భారీగా పెరిగింది. 300 అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల ఇన్ కమ్ భారీ స్థాయికి చేరింది.
వారి రోజుకు సగటున రూ.4,076 కోట్లు సంపాదిస్తున్నారు. గత రెండేళ్లలో వీరంతా రూ.30 లక్షల కోట్లు సంపాదించారు. దీంతో వారి సంపద రూ. రూ.138 లక్షల కోట్లకు చేరింది. ఇందుకు సంబంధించి 2026 బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్ విడుదల చేసింది. నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలండ్ వంటి దేశాల జీడీపీ విలువ కంటే వీరి మొత్తం సంపద ఎక్కువని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూసినా ఈ కుటుంబాల సంపద మాత్రం 27.5% పెరిగింది.
Read Also: PM Modi: 'హర్ ఘర్ తిరంగా'లో ప్రజలంతా పాల్గొనాలి.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
Billionaire Families
Billionaire Families : కుమార్ మంగళ బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో
దేశంలో ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ సంపదలో తొలి స్థానంలో కొనసాగుతోంది. వీరి కుటుంబ సంపద విలు గత సంవత్సరం కాలంగా 8.5 శాతం తగ్గినా.. రూ.25,82 లక్షల కోట్లుగా ఉంది. కుమార్ మంగళ బిర్లా కుటుంబం రూ.8.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 300 సంపన్న కుటుంబాలు 54 లక్షల మందికి ఉద్యోగం కల్పించారు. ఈ కుటుంబాలు ట్యాక్స్ రూపంలో ఇవి రూ.1.9 లక్షల కోట్లు కట్టాయి. ఇది దేశ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్లలో 17 శాతానికి సమానంగా ఉంది. ఈ 300 సంపన్న కుటుంబాల జాబితాలో డాక్టర్ రెడ్డిస్ కుటుంబం రూ.1,13,300 కోట్ల సంపదతో 24వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం విడిగా తొలి తరం కుటుంబ వ్యాపారాలకు చెందిన 100 ర్యాంకులతో జాబితా విడుదల చేశారు. వీరి మొత్తం సంపద రూ.77.8 లక్షల కోట్లుగా ఉన్నట్లు వివరించారు. మొత్తం కలిపితే దేశంలో 400 అత్యంత సంపన్న కుటుంబాలు ఉన్నట్లు లెక్క. వీరి సంపద విలువ రూ. రూ.215.8 లక్షల కోట్లు ఉంటుంది. తొలి తరం విభాగంలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.19.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
దక్షిణాదిలోనే అత్యంత ఎత్తయిన టవర్లు: కోకాపేటలో ట్రంప్ బ్రాండ్ రీఎంట్రీ!

