Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందన ఇదే!

ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం.. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందన ఇదే!

వార్త 2 weeks ago

Vijay Oath: తమిళనాడులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి కీలక పార్టీలు విజయ్‌కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో మెజారిటీ మార్కును అందుకున్న విజయ్, రేపు ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.ఈ వేడుక కోసం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

Read Also:Spam Calls: మీకు రోజూ స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఇలా చేయండి!

ఆరు రోజుల ఉత్కంఠకు ముగింపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై గత ఆరు రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారడంతో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు మిత్రపక్షాల సహకారంతో విజయ్ పగ్గాలు చేపట్టనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

 TamilNaduPolitics

Vijay Oath: కుమారుడి విజయంపై తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందన

విజయ్ ముఖ్యమంత్రి కావడంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. కుమారుడి రాజకీయ ఎదుగుదల పట్ల ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నేను ఏం చేసినా అది నా కుమారుడి కోసమే చేశాను. చివరకు విజయ్ ద్వారా తమిళ ప్రజలు విజయం సాధించారు” అని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha