Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముక్క ప్రియులకు చుక్కలు.. చికెన్, మటన్ ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ముక్క ప్రియులకు చుక్కలు.. చికెన్, మటన్ ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వార్త 2 weeks ago

Meat Prices: నాన్ వెజ్ అంటే ఇష్టపడే వారికి ఇప్పుడు చికెన్ కొనాలంటేనే భయం వేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధర కేజీకి రూ.80 వరకు పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

గతంలో రూ.260 ఉన్న కేజీ చికెన్ ప్రస్తుతం రూ.360 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ చికెన్ ధర అయితే మరింత ఎక్కువగా ఉంది. కేవలం చికెన్ మాత్రమే కాకుండా గుడ్ల ధరలు కూడా డజన్ రూ.75 మార్కును తాకాయి.

Read also: BSNL : BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్

 Chicken and Mutton Prices Soar!

Meat Prices: ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే

ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండటంతో కోళ్ల ఫారాలలో కోళ్లు చనిపోతున్నాయి. దీనివల్ల మార్కెట్లోకి రావాల్సిన సరుకు సరఫరా భారీగా తగ్గింది. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. హోటళ్లు, ఫంక్షన్ల నుంచి ఆర్డర్లు ఎక్కువగా ఉండటం వల్ల అందుబాటులో ఉన్న మాంసం సరిపోవడం లేదు. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

జూన్ వరకు మటన్ ధరల మోత తప్పదు

మటన్ ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. మార్కెట్లో కేజీ మటన్ రూ.1100 ఉండగా, బోన్ లెస్ మటన్ రూ.1300 వరకు విక్రయిస్తున్నారు. ఎండ తీవ్రత తగ్గేవరకు అంటే జూన్ చివరి వరకు ఈ ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చికెన్ ప్రియులు ధరలు చూసి షాక్ అవుతుంటే, మటన్ రేట్లు వింటేనే ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha