Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముక్కలైన కలలు.. ముగిసిన కుటుంబం: ఒకే ఇంట్లో ఐదుగురి ప్రాణాలు బలి!

ముక్కలైన కలలు.. ముగిసిన కుటుంబం: ఒకే ఇంట్లో ఐదుగురి ప్రాణాలు బలి!

వార్త 2 months ago

Tirupati crime: నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెంలో ఒక వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి, అనంతరం ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ హృదయ విదారక ఘటనలో నిందితుడు మోహన్‌తో పాటు అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

Read Also:Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్‌లో బస్సు బోల్తా.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

ఇంట్లోనే తల్లి, భార్య హత్య

పోలీసుల కథనం ప్రకారం, వెంకటకృష్ణ పాలెం గ్రామానికి చెందిన మోహన్ స్థానిక మండల కేంద్రంలో సిమెంట్ షాపు నడుపుతుండేవాడు. నిన్న మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లిన మోహన్, ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని బావమరిది బాలకృష్ణ ఇంటికి వెళ్లి చూశాడు. అక్కడ మోహన్ భార్య హరిత (33), తల్లి చంద్రకళ (65) విగతజీవులుగా పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. మోహనే వారిద్దరినీ చున్నీతో మెడ బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

 Shattered dreams… an ending family: Five lives lost in one house!

తండ్రిని రక్షించబోయి పిల్లల మృతి

తల్లిని, భార్యను హతమార్చిన అనంతరం మోహన్ నేరుగా పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్ళాడు. తన మామ చనిపోయాడని అబద్ధం చెప్పి కొడుకు కౌశిక్ (14), కూతురు హరిణి (12)లను తన బైక్‌పై తీసుకెళ్లాడు. రాత్రి 7:15 గంటల సమయంలో పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ ఆపి, పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

తండ్రిని ఆత్మహత్య చేసుకోవద్దని పిల్లలు ప్రాధేయపడ్డారు. పట్టాలపై ఉన్న తండ్రిని పక్కకు లాగే క్రమంలో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన రైలు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్‌తో పాటు ఆ ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

Tirupati crime: మిస్టరీగా మారిన కారణాలు

మోహన్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ గొడవలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు. అంతా సవ్యంగా ఉన్న తరుణంలో మోహన్ ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వెంకటకృష్ణ పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మీర్జాపూర్‌లో ఘోర ప్రమాదం: 11 మంది సజీవ దహనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha