IPL Mumbai New Captain : ఐపీఎల్ విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో త్వరలోనే పెను మార్పులు చోటుచేసుకోనున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.
ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు, జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన ముంబై సారథ్య బాధ్యతల నుండి తప్పుకోవడం దాదాపు ఖాయమైందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, హార్దిక్ తర్వాత ముంబై పగ్గాలు అందుకునే ఆ తదుపరి కెప్టెన్ ఎవరనే ప్రశ్నపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ రేసులో అందరికంటే ముందుగా తెలుగు క్రికెటర్, యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ సంచలన నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Read Also : ప్రాణం పెట్టి ఆడినా తప్పని పరాజయం..మైదానంలోనే ఏడ్చేసిన వైభవ్!

సూర్య, బుమ్రాలను కాదని తిలక్ వర్మకే ఎందుకు?
సాధారణంగా జట్టులో రోహిత్ శర్మ తర్వాత సీనియర్లు అయిన సూర్యకుమార్ యాదవ్ లేదా జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ, వీరిద్దరికీ ప్రస్తుతం వయసు పైబడుతుండటం (Age Factor), భవిష్యత్తులో సుదీర్ఘ కాలం జట్టును నడిపించే యువ నాయకుడి కోసం ముంబై వేట సాగిస్తుండటంతో తిలక్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. మైదానంలో ఎంతో ప్రశాంతంగా (Cool) ఉంటూ, ఒత్తిడి సమయాల్లోనూ అద్భుత ఇన్నింగ్స్‌లతో ముంబై జట్టును ఒంటిచేత్తో గెలిపించిన ట్రాక్ రికార్డ్ ఈ హైదరాబాద్ కుర్రాడికి ఉంది. యువకుడైన తిలక్ వర్మకు ఇప్పుడే సారథ్య బాధ్యతలు అప్పగిస్తే, సుదీర్ఘ కాలం పాటు జట్టుకు బలమైన పునాది పడుతుందని ముంబై థింక్ ట్యాంక్ భావిస్తోంది. ఈ వార్త నిజమైతే ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యుత్తమ ఫ్రాంచైజీకి కెప్టెన్ అయిన తెలుగు ఆటగాడిగా తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

