Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడే ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో?

నేడే ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో?

వార్త 2 weeks ago

IPL 2026 Final Match : ఐపీఎల్ 2026 మహా సంగ్రామం ముగింపు దశకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

Read Also : IPL హిస్టరీలోనే తొలిసారి ఇలా !!

గిల్ తొలి కప్ కల.. పాటిదార్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఆశలు!

2022లో అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, ఈసారి యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తన రెండో ట్రోఫీపై కన్నేసింది. కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ కప్‌ను ముద్దాడాలని గిల్ పట్టుదలతో ఉన్నాడు. మహమ్మద్ షమీ నేతృత్వంలోని గుజరాత్ పేస్ దళం పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. రేపు (జూన్ 1) ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పుట్టినరోజు కావడంతో, అతనికి ముందస్తు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ ఐపీఎల్ ట్రోఫీని అందించాలని బెంగళూరు జట్టు, అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

పోరు హోరాహోరీ: వ్యూహాలు – ప్రతివ్యూహాలు!

ఈ ఫైనల్ మ్యాచ్ ప్రధానంగా గుజరాత్ బౌలింగ్‌కు, బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య జరగనున్న యుద్ధంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్‌లతో కూడిన ఆర్సీబీ పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్ పిచ్‌పై భారీ షాట్లతో డామినేట్ చేయాలని బెంగళూరు ప్లాన్ చేస్తోంది. అయితే, సొంత గడ్డపై ఆడుతుండటం గుజరాత్‌కు కలిసివచ్చే అంశం. ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసేందుకు జిటి పేసర్లు వైవిధ్యమైన బంతులతో స్కెచ్ వేస్తున్నారు. ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో ఈ రాత్రి అహ్మదాబాద్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha