Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై కుటుంబ మరణాల కేసు విచారణలో కీలక విషయాలు

ముంబై కుటుంబ మరణాల కేసు విచారణలో కీలక విషయాలు

వార్త 2 weeks ago

Mumbai Family Death Case: ఈ ప్రపంచంలో ఎవరని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఆస్తులకోసం, ఇతర కారణాల కోసం ఒకరినొకరు చంపుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం సాధారణ విషయాలుగా పరిణమిస్తున్నాయి.

సొంత కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను ఎవరినీ నమ్మే పరిస్థితులు కనుమరుగై పోతున్నాయి. తాజాగా ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన కేసులో కీలక ఫోరెన్సిక్ పరిశోధన వివరాలు బయటకు వస్తున్నాయి. మొదట ఫుడ్ పాయిజనింగ్ గా భావించిన ఈ ఘటన ఇప్పుడు పూర్తిస్థాయి విషప్రయోగపు అనుమానాలవైపు మళ్లుతోంది. మృతుల శరీరాల్లోనే కాకుండా వారు తిన్న పుచ్చకాయ నమూనాల్లో కూడా ఎలుకల మందులో ఉపయోగించే ప్రమాదకర రసాయనం గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

Read Also :Sitaphalmandi Crime: బీటెక్ విద్యార్థి ‘పరువు’ హత్య..

సంచలనం సృష్టించిన సంఘటన పూర్వాపరాలు

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అప్పటివరకు ఎంతో ఆనందంగా బంధువుల మధ్య గడిపిన కుటుంబం కొన్నిగంటల్లోనే విగతజీవులుగా మారిపోయారు. అందమైన కుటుంబం హఠాత్తుగా మృత్యువడిలోకి చేరుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్రసంచలనంగా మారింది. గతనెలలో ముంబయికి చెందిన ఒక బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో అబ్దుల్లా డోకాడియా కుటుంబం రాత్రి పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. అయితే అదే సమయంలో అదే బిర్యానీ తిన్న బంధువులకు ఎలాంటి సమస్యలు రాకపోవడంతో దర్యాప్తు మొదటి నుంచే పుచ్చకాయ వైపు మళ్లింది. పుచ్చకాయలో జింక్ ఫాస్ఫైడ్ ప్రమాదవశాత్తూ చేరిందా? లేక ఉద్దేశపూర్వంగా కలిపారా? అన్నదానిపై ఫోరెన్సిక్ బృందాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. పుచ్చకాయలోకి యాదృచ్ఛికంగా ఎలుకల మందు వెళ్లే అవకాశం సాధారణంగా ఉండదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మందును పండులోకి ఎక్కిస్తేనే సాధ్యం. అది డోకాడియా కుటుంబమే చేసి ప్రాణాలు తీసుకుందా? లేక బంధువుల్లో ఎవరైనా చేసారా అనేది తేలాల్సి వుంది. ప్రాథమిక పోస్ట్ మార్టం పరీక్షలో మృతుల కొన్ని అవయవాలు ఆకుపచ్చరంగులోకి మారినట్లు వైద్యులు గుర్తించారు. ఇది కొన్ని విషప్రయోగ కేసుల్లో కనిపించే లక్షణాల్లో ఒకటిగా చెబుతున్నారు.

Mumbai Family Death Case: అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు వేగవంతం

పోలీసులు ప్రస్తుతం అన్నికోణాల్లో దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నారు. పుచ్చకాయ నమూనాలు, భోజన పదార్థాలు, నీటి నమూనాలు అన్నింటినీ మరోసారి విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. తుది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన విషప్రయోగమా? లేక ఉద్దేశపూర్వక హత్యా? అన్నది స్పషమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు తమమధ్య ఎంతో ఆనందంగా గడిపిన అబ్దుల్లా డోకాడియా కుటుంబం మరణించడం బంధువులు జీర్ణించుకో లేకపోతున్నారు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి బాధిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రూ. 9.35 కోట్ల మోసం కేసులో పోలీసుల నోటీసులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha