Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైకి వరుసగా మూడో ఓటమి

ముంబైకి వరుసగా మూడో ఓటమి

వార్త 2 months ago

RR vs MI Result: ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ (RR) 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి ముంబైకి షాక్ ఇచ్చారు.

గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తమ అజేయ ఫామ్‌ను కొనసాగించింది. మంగళవారం రాత్రి జరిగిన 11 ఓవర్ల పరిమిత పోరులో ముంబై ఇండియన్స్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. యశస్వి జైస్వాల్ (77) మెరుపు ఇన్నింగ్స్‌తో మొదలైన రాజస్థాన్ జోరు, బౌలర్ల ధాటితో ముంబైని కోలుకోలేని దెబ్బతీసింది.

RR vs MI Result: జైస్వాల్, సూర్యవంశీ సిక్సర్ల జాతర

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. యశస్వి జైస్వాల్ (77 – 32 బంతులు) కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మరోవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (39 – 14 బంతులు) బుమ్రా బౌలింగ్‌లో కూడా భయం లేకుండా 5 భారీ సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ 150 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముంబైకి తప్పని పరాజయం

151 పరుగుల హిమాలయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6), హార్డిక్ పాండ్యా (9) వరుసగా విఫలం కావడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి. నమన్ ధీర్ (25), రూథర్‌ఫోర్డ్ (25) కొంచెం పోరాడినా రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, మరియు రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు. ఈ ఓటమితో ముంబై ఈ సీజన్‌లో హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబై ఇండియన్స్ (MI)..10 ఓవర్లలో 116/8

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha