Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో ఆదాయానికి మించి పెరిగినా ఇంటి అద్దెలు

ముంబైలో ఆదాయానికి మించి పెరిగినా ఇంటి అద్దెలు

వార్త 2 weeks ago

House Rents: భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో నివసించాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇంటి అద్దెలు పెనుభారంగా మారాయి. 2026లో సింగిల్ బెడ్‌రూమ్ (1BHK) ఫ్లాట్ల అద్దెలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి.

ఇది ఉద్యోగస్తుల నెలవారీ ఆదాయానికి, జీవన వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భారీగా పెంచేస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం కొత్తగా ముంబై నగరానికి వచ్చే వారికి ఇక్కడ చిన్న గూడు వెతుక్కోవడం కూడా అందని ద్రాక్షలా మారుతోంది.

ఏరియాల వారీగా 1BHK అద్దెలు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ‘రియల్టీఎక్స్‌టీ’ (RealtyXT) నివేదిక ప్రకారం, ముంబైలోని వివిధ ప్రాంతాలను బట్టి సింగిల్ బెడ్రూం ఫ్లాట్ నెలవారీ అద్దెల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. నగరంలోని సబర్బన్ ప్రాంతాల్లో ఒకటైన భాండూప్‌లో ప్రస్తుతం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నివసించడానికి 1BHK ఫ్లాట్ సగటు నెలవారీ అద్దె రూ. 28,000 వరకు పలుకుతోంది. దక్షిణ ముంబైలోని కొలాబా విషయానికి వస్తే అద్దెల మోత విపరీతంగా ఉంది. ఇక్కడ కేవలం ఒకే ఒక్క బెడ్‌రూమ్ (1BHK) ఉన్న ఫ్లాట్ నెలవారీ అద్దె ఏకంగా రూ. 1.10 లక్షల వరకు ఉంటోంది.

 mumbai-house-rent-hike

వీటితో పాటు బాంద్రా, పరేల్, ప్రభాదేవి, మెరైన్ లైన్స్, దాదర్ వంటి నగర కేంద్ర ప్రాంతాలలో అద్దెలు సామాన్యుడి బడ్జెట్‌కు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు సబర్బన్ ఏరియాలైన అంధేరీ వెస్ట్, గోరేగావ్, ములుంద్, కాందివలి వంటి ప్రాంతాల్లోనూ అద్దెలు గణనీయంగా పెరిగాయి.

Read also: Petrol Price Hike : పెట్రోల్ ధరలు పెంచినప్పటికీ రోజుకు రూ.600కోట్ల నష్టం!

అద్దెలు ఇంతలా పెరగడానికి కారణాలు ఏంటి?

నగరంలో రెంటల్ మార్కెట్ ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి:

సరఫరా కొరత: నగరంలో పెరుగుతున్న ఉద్యోగావకాశాల కారణంగా డిమాండ్ పెరుగుతోంది, కానీ దానికి తగినట్లుగా ఇళ్ల సరఫరా (Supply) లేదు.

మెరుగైన రవాణా వ్యవస్థ: కొత్త రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఆయా రూట్లలో ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరిగింది.

సొంత ఇల్లు కొనలేకపోవడం: ముంబైలో ప్రాపర్టీల ధరలు విపరీతంగా ఉండటంతో, చాలామంది ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది అద్దె మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.

దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ముంబైలోనే అత్యధికంగా అద్దెలు ఉన్నాయని మార్కెట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ అద్దెల పెరుగుదలను అదుపు చేయడానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ చర్యలు గానీ, కొత్త పాలసీల ప్రకటనలు గానీ రాలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also hindi news: hindi.vaartha.com

Read also:

రైతులకు సీఎం విజయ్ శుభవార్త.. రూ.50,000 రుణమాఫీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha