Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో అట్టహాసంగా ముగిసిన 'అమెజాన్ బ్యూటీవర్స్ 2026' ఈవెంట్

ముంబైలో అట్టహాసంగా ముగిసిన 'అమెజాన్ బ్యూటీవర్స్ 2026' ఈవెంట్

వార్త 2 months ago

Amazon Beautyverse 2026 : అమెజాన్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడవ ఎడిషన్ 'అమెజాన్ బ్యూటీవర్స్ 2026' దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత వైభవంగా ముగిసింది.

రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు ముందు జరిగిన ఈ ఈవెంట్, ఇప్పటివరకు దేశంలోనే నమోదైన అతిపెద్ద బ్యూటీ ఈవెంట్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని ప్రసిద్ధ వర్లీ సీ లింక్‌పై అద్భుతమైన ప్రొజెక్షన్‌తో ప్రారంభమైన ఈ వేడుకకు దాదాపు 2,500 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. వీరిలో 1,500 మందికి పైగా డిజిటల్ క్రియేటర్లు, ప్రైమ్ మెంబర్లు, లీడింగ్ బ్యూటీ బ్రాండ్ల ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, జాక్లిన్ ఫెర్నాండెజ్, శిల్పా షెట్టీ, సొనాక్షీ సిన్హా, మీరా కపూర్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్లోబల్ బ్యూటీ ఇన్నోవేషన్స్, ప్రీమియం బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు ఇంగ్రేడియంట్-లెడ్ స్కిన్‌కేర్ విభాగాలపై నిపుణుల చర్చలు, లైవ్ ట్రెండ్ షోకేస్‌లు ఈ ప్రదర్శనలో వీక్షకులను ఎంతగానో మైమరపించాయి.

అమెజాన్ సరికొత్త స్టోర్‌ఫ్రంట్

ఈ ఏడాది బ్యూటీవర్స్ ఈవెంట్‌లో అమెజాన్ ఇండియా ఒక సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. కేవలం ముంబై వేదికకే పరిమితం కాకుండా, మొదటిసారిగా Amazon.in యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ‘బ్యూటీవర్స్ స్టోర్‌ఫ్రంట్’ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కస్టమర్లు ఇంట్లోనే కూర్చుని సరికొత్త సౌందర్య ట్రెండ్‌లను వీక్షించే, ప్రముఖ క్రియేటర్ల బ్యూటీ టిప్స్ తెలుసుకునే మరియు ప్రైమ్ డే ప్రత్యేక ఆఫర్లతో షాపింగ్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. కంటెంట్, కమ్యూనిటీ, టెక్నాలజీ మరియు ఈ-కామర్స్ (వాణిజ్యం) రంగాలను ఒకేతాటిపైకి తీసుకురావడం ద్వారా, భారతదేశంలో ఆన్‌లైన్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోళ్లకు తానే అతిపెద్ద కేరాఫ్ అడ్రస్ అని అమెజాన్ బ్యూటీ మరోసారి నిరూపించుకుంది.

విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ 'టోయింగ్' ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha