Mumbai Pav Price Hike: దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరల సెగ ముంబై నగర ప్రజలకు గట్టిగానే తగిలింది. ముంబైలో పావ్ ధరల పెంపు కారణంగా సామాన్యులకు ఇష్టమైన వడపావ్, పావ్ భాజీ వంటి ఆహార పదార్థాలు ఇప్పుడు మరింత ఖరీదుగా మారాయి.
రవాణా, గ్యాస్ ఖర్చులు పెరగడంతో బేకరీ యజమానులు ధరలను పెంచక తప్పడం లేదని చెబుతున్నారు.
Read also: Maharashtra News: పిల్లలను బస్సులో వదిలేసి..ప్రియుడితో పారిపోయిన తల్లి
Pav prices hiked in Mumbai
పెరిగిన ధరల వివరాలు
గతంలో పన్నెండు పావ్ ల ప్యాకెట్ ధర ఇప్పుడు పది రూపాయలు పెరిగింది. దీనితో ఒక్కో పావ్ ధర మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు చేరింది. ముడి పదార్థాల రేట్లు, ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాపారులు వివరిస్తున్నారు. రోజువారీగా పావ్ కొనే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
Mumbai Pav Price Hike: మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం
ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు పావ్ ప్రధాన ఆహారంగా ఉండే చాలా కుటుంబాలు ఇప్పుడు బడ్జెట్ సర్దుబాటు చేసుకోవాల్సిన స్థితికి వచ్చాయి. పెరిగిన ధరలు సామాన్యుల జేబులకు మరింత చిల్లు పెడుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
యూపీలో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..న్యాయం కోసం ఆర్తనాదాలు!

