Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో వరద బీభత్సం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

ముంబైలో వరద బీభత్సం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

వార్త 2 days ago

Mumbai heavy rains: మహారాష్ట్రలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి.

ముఖ్యంగా రాజధాని ముంబై నగరంలో కురుస్తున్న వానలకు పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దాదర్‌లోని హిందూ కాలనీ పరిసరాల్లో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: EPFO new rules 2026: ఉద్యోగుల కీలక అప్‌డేట్.. EPFO కొత్త నిర్ణయాలు ఇవే!

 Flood havoc in Mumbai… Schools and colleges closed!

Mumbai heavy rains: నాలుగు ప్రాంతాల్లో ‘రెడ్ అలర్ట్’.. విద్యాసంస్థలకు సెలవు

భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన ఆయా జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల తీవ్రతను బట్టి స్థానిక అధికారులు తమ పరిధిలోని మరిన్ని విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో వరద ఉధృతిని అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. రాబోయే గంటల్లో వర్షాలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

స్టూడెంట్ వీసా ఫీజులను భారీగా పెంచిన ఆస్ట్రేలియా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha