Dailyhunt
ముంబైని చిత్తు చేసిన ఢిల్లీ

ముంబైని చిత్తు చేసిన ఢిల్లీ

వార్త 1 week ago

DC vs MI IPL Score: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌ను పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఓడించింది.

సమీర్ రిజ్వీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ సులభంగా అధిగమించింది.

ఆదిలోనే షాక్.. రిజ్వీ ఆదుకున్నాడు

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభం ఆశాజనకంగా లేదు. స్టార్ బ్యాటర్ నితీశ్ రాణా డకౌట్ కాగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరి షాక్ ఇచ్చాడు. అయితే, యువ సంచలనం సమీర్ రిజ్వీ మైదానంలో పరుగుల వరద పారించాడు. ముంబై బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఉతికేస్తూ 90 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

DC vs MI IPL Score: సమిష్టి కృషితో విజయం

రిజ్వీకి తోడుగా నిస్సాంక (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (21) తన అనుభవాన్ని జోడించి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవ్వడంతో ఢిల్లీ వరుస విజయాలతో దూసుకుపోతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబై ఇండియన్స్ భారీ స్కోరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha