Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంచుకొస్తున్న తుఫాన్.. వైద్య, ఆరోగ్యశాఖ హై అలర్ట్!

ముంచుకొస్తున్న తుఫాన్.. వైద్య, ఆరోగ్యశాఖ హై అలర్ట్!

వార్త 0 months ago

Arnab Cyclone: రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న 'అర్నబ్' తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అత్యంత అప్రమత్తమైంది.

తుఫాన్ ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా క్షణాల వ్యవధిలో స్పందించేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆరోగ్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

అత్యవసర పడకలు, ప్రత్యేక వైద్య బృందాల కేటాయింపు

తుఫాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులలో మొత్తం 6,431 అత్యవసర పడకలను సిద్ధం చేశారు. అలాగే, క్షేత్రస్థాయిలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు వీలుగా 630 ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు.

Arnab Cyclone: సంచార వైద్య వాహనాలు మరియు కమాండ్ కంట్రోల్ రూమ్‌లు

వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి 326 సంచార వైద్య వాహనాలను అందుబాటులో ఉంచారు. మరోవైపు, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, జిల్లాల మధ్య సమన్వయం కొరకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

అర్ణబ్ తుపానుపై ప్రభుత్వం అప్రమత్తం.. పరిస్థితిని సమీక్షిస్తున్న చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha