Vizag Crime: విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక్క పరుగు కోసం మొదలైన మాటామాటా పెరిగి, చివరకు కక్షగా మారి హత్యకు దారి తీసింది.
ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగదిలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Read Also: Markapuram crime: 'నాన్న జాగ్రత్త' అని రాసి టీచర్ ఆత్మహత్య
వివాదం ఎలా మొదలైంది?
ఆదివారం కావడంతో విశాఖలోని పెదగదిలి ప్రాంతంలో వినాయక నగర్, చాకలిపేట, పెద్దగదిలి జట్ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించారు.వినాయక నగర్, చాకలిపేట జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, అజిత్ (అలియాస్ పెద్ద) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క పరుగు విషయంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.మ్యాచ్‌తో సంబంధం లేని కిట్టు కిశోర్ (అలియాస్ బాక్సర్ కిషోర్) అనే వ్యక్తి అక్కడే కూర్చుని మ్యాచ్ చూస్తున్నాడు. అంపైర్ చిరంజీవి వివాదాన్ని సర్దుబాటు చేస్తుండగా, కిషోర్ అనవసరంగా జోక్యం చేసుకుని అంపైర్‌తో గొడవకు దిగాడు. దీనిని అజిత్ ప్రశ్నించడంతో కిషోర్ కక్ష పెంచుకున్నాడు.ఇంతలో పక్కన ఉన్నవారు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
Vizag Cricket Match Dispute
మ్యాచ్ సందర్భంగా వివాదం జరిగి సర్దుబాటు జరిగిన తర్వాత ఎవరు ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కిషోర్.. విశాలక్షినగర్ నుంచి పెదగదిలి వచ్చాడు. అక్కడ యువకులతో మళ్లీగొడవపడ్డాడు. అదే సమయంలో పక్కనే ఉన్న అజిత్‌పై దాడిచేసి.. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో ఛాతిలో పొడిచేశాడు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన అక్కడే ఉన్న మరి కొంతమంది యువకులు వారించే ప్రయత్నం చేశారు. నాగు అనే యువకుడు అడ్డుకునేందుకు యత్నించగా.. అతని పైన దాడి జరిగి చేతికి గాయమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అజిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి తరలించే సరికి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం, స్నేహితులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు.
పోలీసుల చర్యలు
గాయపడిన నాగును సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కిషోర్ ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్ అని పోలీసులు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

