Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మ్యాజిక్ ఫిగర్ లేకుండా విజయ్ ప్రమాణస్వీకారం జరగదు: గవర్నర్

మ్యాజిక్ ఫిగర్ లేకుండా విజయ్ ప్రమాణస్వీకారం జరగదు: గవర్నర్

వార్త 3 months ago

Tamil Nadu: తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తొలిసారిగా స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్) నిరూపించుకోకుండా ఎవరినీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also :TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

Tamil Nadu: బలం నిరూపిస్తేనే అవకాశం

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ ఇప్పటికే తనను రెండు సార్లు కలిశారని గవర్నర్ ధృవీకరించారు. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పూర్తి బలం ఉందని నిరూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. “ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం ఉండటం అత్యంత ముఖ్యం. మ్యాజిక్ ఫిగర్ లేకుండా ప్రమాణస్వీకారం జరగదు” అని ఆయన తేల్చి చెప్పారు.

అనిశ్చితి ముగియాలని ఉంది..

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై కూడా గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిష్టంభన తనకు కూడా ఇష్టం లేదని, దీనిని వీలైనంత త్వరగా ముగించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనలకు లోబడి, తగిన ఆధారాలతో మెజారిటీని చూపిస్తే వెంటనే తదుపరి ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి దృష్టి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీపై మళ్లింది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం లేదా స్వతంత్రుల అండతో మ్యాజిక్ ఫిగర్ చూపించడంపైనే ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

స్పష్టత రాని కేరళ సీఎం ఎంపిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha