Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

వార్త 3 months ago

టీవీకే పార్టీకి ఉన్న 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారనే వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డీఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి, స్వతంత్రులను లేదా ఇతర చిన్న పార్టీలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు విజయ్ అనుమానిస్తున్నారు.

ఒకవేళ ప్రజా తీర్పుకు వ్యతిరేకగా ఈ రెండు పార్టీలు కుమ్మక్కై అధికారాన్ని పంచుకోవాలని చూస్తే, దానికి నిరసనగా తమ ఎమ్మెల్యేలందరూ తప్పుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే సరైన మార్గమని టీవీకే భావిస్తోంది.

Read Also : మెజార్టీ ఉంటే ఎవరినైనా ఆహ్వానిస్తా: గవర్నర్

కుమ్మక్కు రాజకీయాలపై టీవీకే అనుమానం

తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో, డీఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయని టీవీకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీని అధికారానికి దూరం చేయడానికి దశాబ్దాల ప్రత్యర్థులైన ఈ రెండు పార్టీలు ఏకమవడంపై విజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ “కుమ్మక్కు రాజకీయాలను” ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాజీనామానే సరైన అస్త్రమని, తద్వారా నైతిక విజయం సాధించవచ్చని పార్టీ సీనియర్ నేతలు చర్చిస్తున్నారు.

రాబోయే గంటల్లో క్లారిటీ

ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. నేడు ఉదయం 9 గంటలకు జరగబోయే టీవీకే ఎమ్మెల్యేల భేటీలో ఈ రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 107 మంది ఎమ్మెల్యేలు నిజంగానే రాజీనామా చేస్తే, తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు వస్తాయా లేదా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తీసుకునే ఈ సాహసోపేత నిర్ణయం తమిళ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. నినాదాలతో హంగామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha