Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా భార్యకు ఈడీ నోటీసులు రాలేదు.. ఆ ప్రచారం అబద్ధం!

నా భార్యకు ఈడీ నోటీసులు రాలేదు.. ఆ ప్రచారం అబద్ధం!

వార్త 3 weeks ago

Kesineni Chinni: తన సతీమణికి ఈడీ (ED) వ్యక్తిగత సమన్లు జారీ చేసిందంటూ సోషల్ మీడియా మరియు కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో వస్తున్న ప్రచారాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రంగా ఖండించారు.

ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందిస్తూ అసలు నిజాలను మీడియా ముందు ఉంచారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది నిజమేనని, అయితే అవి తన భార్యకు వ్యక్తిగతంగా వచ్చినవి కావుని, తాము గతంలో భాగస్వామ్యులుగా ఉన్న సంస్థలకు మాత్రమే వచ్చాయని ఎంపీ స్పష్టం చేశారు.

Read Also :Janaki Lakshmi ED Notice: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు

నా భార్య కేవలం కంపెనీ డైరెక్టర్ మాత్రమే

 Kesineni Shivnath Chinni ED Notice Statement

ఎంపీ కేశినేని చిన్ని తెలిపిన వివరాల ప్రకారం.. తాము గతంలో స్థాపించిన ‘ఇశాన్వీ’ (Ishaanvi) మరియు ‘కేశినేని డెవలపర్స్’ (Kesineni Developers) సంస్థలకు ఈడీ నోటీసులు పంపినట్లు ఆయన అంగీకరించారు. గతంలో నిర్వహించిన ఆయా కంపెనీల వ్యాపార లావాదేవీలపై ఆరా తీసేందుకు దర్యాప్తు సంస్థ ఈ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఆయా కంపెనీలలో తన భార్య జానకీ లక్ష్మి కేవలం ఒక డైరెక్టర్‌గా మాత్రమే కొనసాగారని, అందువల్ల సంస్థలకు వచ్చిన నోటీసులను కొందరు కావాలనే రాజకీయం చేస్తూ ఆమెకు వ్యక్తిగతంగా నోటీసులు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Kesineni Chinni:అసలు నిజం చెప్పిన ఎంపీ కేశినేని చిన్ని

ముఖ్యంగా, ఢిల్లీ లేదా సౌత్ లిక్కర్ స్కామ్ (మద్యం కుంభకోణం) తో తన భార్యకు నోటీసులను ముడిపెడుతూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎంపీ చిన్ని ఖరాఖండీగా చెప్పారు. మద్యం స్కామ్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. వ్యాపార సంస్థల పరంగా వచ్చిన నోటీసులకు తాము చట్టప్రకారం పూర్తిస్థాయిలో సహకరిస్తామని, దర్యాప్తు సంస్థలు అడిగిన వివరాలను అందజేస్తామని ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీ యువతకు సీఎం భరోసా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha