Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు

వార్త 3 weeks ago

Janaki Lakshmi ED Notice: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు కలకలం రేపుతున్నాయి. విజయవాడ తెలుగుదేశం పార్టీ (TDP) లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకీ లక్ష్మికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ’ (Pride Infracon LLP) కంపెనీ ఆర్థిక లావాదేవీల్లో జరిగినట్లుగా భావిస్తున్న అక్రమాలు, అవకతవకలపై ఈడీ అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే ఈనెల 27వ తేదీన (బుధవారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

Read Also :Vavilala Leela Maheshwari: వావిలాల లీలామహేశ్వరి ఇకలేరు

 Pride Infracon LLP Case Updates

Janaki Lakshmi ED Notice: కేశినేని జానకీ లక్ష్మిని టార్గెట్ చేసిన ఈడీ!

నిజానికి ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి కేశినేని జానకీ లక్ష్మికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇదే అంశంపై ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన ఉదంతం ఉంది. అయితే, పాత కేసులోనే విచారణను మరింత వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు మరోసారి సమన్లు జారీ చేసి గడువు విధించడం గమనార్హం.

మే 27న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయవాడ రాజకీయాల్లో కేశినేని చిన్ని కీలక నేతగా ఎదిగిన నేపథ్యంలో, ఆయన భార్యకు ఈడీ నోటీసులు రావడం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పారిశ్రామిక వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 27న జానకీ లక్ష్మి ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా గడువు కోరతారా? అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జూన్ 1 నుంచి తిరుపతికి సరికొత్త వీక్లీ రైలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha