CM Vijay birthday: తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని విశ్వనాయకుడు కమల్ హాసన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. “లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న నా ప్రియ సోదరుడు, ముఖ్యమంత్రి విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ కమల్ హాసన్ ఎంతో ఆప్యాయంగా ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read also: Reliance Industries: రిలయన్స్ షేర్ల జోరు.. 34% లాభం ఖాయమా?
CM Vijay birthday: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిజీగా కమల్ హాసన్
కమల్ హాసన్ గతేడాది 'థగ్ లైఫ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ విజువల్ వండర్ 'కల్కి 2' షూటింగ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ‘కల్కి’ పార్ట్-1 ముగింపులో సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్ చూపించిన విశ్వరూపానికి థియేటర్లలో భారీ రెస్పాన్స్ వచ్చింది. దీనికి కొనసాగింపుగా రాబోతున్న పార్ట్-2 లో ఆయన క్యారెక్టర్ మరింత నెక్స్ట్ లెవెల్‌లో, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం.
మరోవైపు, ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయింది. ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమల్ హాసన్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌పై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
సీఎం విజయ్ బర్త్ డే.. పుట్టినరోజున జన్మించిన బిడ్డలకు ఉచితంగా బంగారు ఉంగరాలు

