Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'నా వైఫ్ మిస్సింగ్' మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా?

'నా వైఫ్ మిస్సింగ్' మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా?

వార్త 1 day ago

Na Wife Missing: కొత్త బంగారు లోకం వంటి కల్ట్ హిట్ తర్వాత సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత టాలీవుడ్ క్యూట్ పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నా వైఫ్ మిస్సింగ్'.

స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) లో నేటి (అక్టోబర్ 23) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జంట ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

Salaar 2 Update: 'సలార్ 2'పై బిగ్ అప్‌డేట్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్ట్ వైరల్

Na Wife Missing: కథేంటంటే..

బాలు (వరుణ్ సందేశ్) బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. తన భార్య స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) కనిపించడం లేదంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలవుతుంది. అసలు వీరిద్దరి గతం ఏంటి? పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిలో స్వప్న తాను వర్జిన్ కాదని ముందుగానే చెప్పినా బాలు ఆమెను ఎందుకు వివాహం చేసుకున్నాడు? పెళ్లి తర్వాత స్వప్న తన పాత ప్రేమికుడు అబాన్ (మోహిత్ పెద్దాడ)తో వెళ్లిపోతానని చెప్పడం, దానికి బాలు సైలెంట్‌గా అంగీకరించడం వంటి పరిణామాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.

అనుకోకుండా స్వప్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాలు అనుమానితుడిగా మారుతాడు. అబాన్ కూడా స్వప్న తన దగ్గరకు రాలేదని చెప్పడంతో బాలుకి బెయిల్ ఇప్పిస్తాడు. మరి చివరికి స్వప్న ఎక్కడికి వెళ్ళింది? ఆమె అదృశ్యానికి అసలు కారణం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఆహా ఓటీటీలో 'నా వైఫ్ మిస్సింగ్' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఒక అమ్మాయి మిస్ అవ్వడం, ఆమెను పోలీసులు ఎలా కనిపెడతారనే రొటీన్ పాయింటే అయినప్పటికీ.. నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను జోడించి దర్శకురాలు ఈ కథను తెరకెక్కించారు. గతానికి, ప్రస్తుతానికి మధ్య సాగే స్క్రీన్ ప్లే సినిమాను నడిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లి, లవ్ ట్రాక్, పాత్రల పరిచయంతో సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై క్యూరియసిటీని పెంచుతుంది.

అయితే, సినిమా కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో మలయాళ థ్రిల్లర్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. పెళ్లి తర్వాత పాత ప్రేమలను కొనసాగించడం వల్ల జరిగే దారుణాలను ఈ చిత్రంలో బలంగా చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహకందదు. సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్ అవుతుంది.

నటీనటుల నటన

నటీనటుల విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ సహజమైన నటనతో మెప్పించింది. పోలీస్ ఆఫీసర్లుగా నటించిన జబర్దస్త్ సత్యశ్రీ, ప్రవీణ్ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించగా, బాయ్‌ఫ్రెండ్ పాత్రలో మోహిత్ పెద్దాడ పర్వాలేదనిపించాడు.

సాంకేతిక నిపుణులు

సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే కొన్ని ట్యూన్స్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఎన్.ఎస్. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను రిచ్‌గా చూపించగా, ఆదిత్య భార్గవ్ రాసిన డైలాగులు ఆకట్టుకుంటాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దర్శకురాలు స్వాతిప్రకాష్ తన టేకింగ్‌తో సినిమాను నీట్‌గా తెరకెక్కించారు.

రొటీన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి వీకెండ్‌లో ‘నా వైఫ్ మిస్సింగ్’ చూడదగ్గ చిత్రం!

Epaper: epaper.vaartha.com

'ఫౌజీ' నుంచి ఇంటెన్స్ పోస్టర్.. అతను ఎవరు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha