Salaar 2 Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'సలార్' చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.
సోషల్ మీడియాలో ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనను 'ది వైలెంట్ మ్యాన్' అంటూ అభివర్ణించింది. ఈ ప్రత్యేక పోస్ట్ ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
Surya: సూర్య సినిమాలో విలన్ గా యువ హీరో
Big update on 'Salaar 2'.. Prabhas's special birthday post goes viral
Salaar 2 Update: 'సలార్ 2: శౌర్యంగ పర్వం' కోసం ఈగర్‌గా వెయిటింగ్
బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన 'సలార్ పార్ట్ 1 - సీజ్‌ఫైర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'సలార్ 2 శౌర్యంగ పర్వం' గురించి మేకర్స్ ఈ సందర్భంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కోసం తాము కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చిత్రనిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా తెలిపింది.
ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ద్వయం, పార్ట్-2తో మరోసారి థియేటర్లలో తమ విధ్వంసకర సత్తా చాటడానికి సిద్ధమవుతోందని స్పష్టం చేయడంతో రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ బర్త్‌డే స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Epaper: epaper.vaartha.com
'కల్కి 2'లో భైరవగా ప్రభాస్.. బర్త్‌డే స్పెషల్ వీడియో విడుదల

