Dailyhunt
నాడు 2 సీట్లు.. నేడు తిరుగులేని శక్తి!

నాడు 2 సీట్లు.. నేడు తిరుగులేని శక్తి!

వార్త 1 week ago

BJP Foundation Day: నేడు భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవం. సరిగ్గా 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ సారథ్యంలో ఈ పార్టీ జన్మించింది.

కేవలం రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించే వరకు సాగడం ఒక సంచలనం.

Read Also: Indian Bureau of Mines: దేశవ్యాప్తంగా మూతపడిన 1,374 గనులు

 BJP Foundation Day: 2 seats yesterday.. today an unstoppable force!

2 సీట్లతో మొదలై..

1984లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, వెనకడుగు వేయకుండా సిద్ధాంతబద్ధంగా ముందుకు సాగింది.

రామజన్మభూమి ఉద్యమం – కీలక మలుపు

1980వ దశకం చివరలో చేపట్టిన రామజన్మభూమి ఉద్యమం బీజేపీ దశను మార్చేసింది. 1989 ఎన్నికల్లో ఏకంగా 75 సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్ పాత్ర పోషించింది. ఆ తర్వాత 1996లో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

వాజ్‌పేయి నుంచి మోదీ వరకు..

అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996, 1998, 1999లో మూడుసార్లు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమారు ఆరేళ్ల పాటు వాజ్‌పేయి ప్రధానిగా దేశాన్ని నడిపించారు. ఇక 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంతో బీజేపీ చరిత్రను తిరగరాసింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి, ప్రస్తుతం తిరుగులేని శక్తిగా కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బీహార్ ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha