Nagar Kurnool Heavy Rains: నాగర్ కర్నూలు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం జిల్లావ్యాప్తంగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Read Also: Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం
నేలకొరిగిన వృక్షాలు.. స్తంభించిన రాకపోకలు
బలమైన గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు రోడ్లపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఉరుముల శబ్దాలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలో విద్యుత్ సరఫరాకు కూడా ఆటంకం కలిగింది.
Nagar Kurnool Heavy Rains: తడిసిన ధాన్యం.. రైతుల కంటకన్నీరు
ఈ అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. వ్యవసాయ మార్కెట్‌లో రైతులు అమ్మకానికి తెచ్చిన వడ్లు, మొక్కజొన్న బస్తాలు వర్షార్పణమయ్యాయి. కాంటా పూర్తికాని ధాన్యం రాశులు నీటిపాలవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడంతో వారు కంటకన్నీరు పెడుతున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు తార్పాలిన్లు కప్పినా, ఈదురు గాలుల ధాటికి అవి నిలవలేకపోయాయి.
రానున్న రెండు రోజుల్లో జిల్లాలో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణం అనుకూలించే వరకు ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

