Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం

వార్త 1 month ago

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనూహ్యంగా మారింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు.

పగటిపూట ఎండలు మండిపోతున్నప్పటికీ, సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షాలు వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. మంగళవారం కూడా నిన్నటిలాగే ఉభయ రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించాయి.

Read Also: TG Rain Alert: రానున్న 2 గంటల్లో వర్షం.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

మధ్యాహ్నం వరకు మండుటెండలు.. ఆపై వరుణుడి పలకరింపు

తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నం సమయానికి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. తీవ్రమైన ఉక్కపోత మరియు వడగాల్పులతో జనజీవనం స్తంభించిపోయింది. అయితే, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి, ప్రజలకు వేసవి తాపం నుండి పెద్ద ఉపశమనం లభించింది.

Rains in Telugu States: ఏపీ మరియు తెలంగాణలో వర్షాల తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు చల్లదనం లభించినప్పటికీ, చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు మూడు రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఎండ ప్రచండం.. రానున్న రెండు రోజుల్లో 47 డిగ్రీలకు చేరనున్నఉష్ణోగ్రతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha