Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నానా పటేకర్‌ మృతిపై జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

నానా పటేకర్‌ మృతిపై జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

వార్త 2 weeks ago

Nana Patekar Death: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారతీయ చిత్రసీమకు ఆయన అందించిన అసమాన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన ప్రగాఢ సంతాప తెలిపారు. నానా పటేకర్‌ నిష్క్రమణ సినీ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

Read Also : Kamal Haasan: ఈసీకి కమల్ హాసన్ లేఖ.. ప్రతిపక్ష ఎంపీలతో భేటీ కావాలని విజ్ఞప్తి

 Junior NTR deeply shocked by Nana Patekar’s death.

Nana Patekar Death: నటనలో నిజాయితీ, పాత్రల్లో జీవం

నానా పటేకర్‌ నటనా శైలిని ఎన్టీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన తెరపై పోషించిన ప్రతి పాత్రలోనూ స్పష్టమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవని కొనియాడారు. నానా పటేకర్‌ పండించిన హావభావాలు ఎప్పుడూ కేవలం నటనలా అనిపించేవి కాదని, తెరపై ఆవిష్కృతమవుతున్న ఒక జీవంలా, సహజమైన జీవితంలా ఉండేవని ఎన్టీఆర్‌ ఆవేదనగా వ్యక్తం చేశారు.

భారతీయ సినిమా రంగంలో నానా పటేకర్‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారని, ఆయన నటన రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్పూర్తిదాయకంగా నిలుస్తుందని ఎన్టీఆర్ తెలిపారు. ఈ కష్ట సమయంలో నానా పటేకర్‌ కుటుంబ సభ్యులకు, ఆయన ఆత్మీయులకు, మరియు కోట్లాది మంది అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha