Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాక్షసత్వానికి పరాకాష్ట: భార్యను ఉరివేసి చంపి.. ప్రాణాలు పోతుంటే కన్నవారికి వీడియో కాల్

రాక్షసత్వానికి పరాకాష్ట: భార్యను ఉరివేసి చంపి.. ప్రాణాలు పోతుంటే కన్నవారికి వీడియో కాల్

వార్త 1 week ago

Bagalkot Crime: కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో అత్యంత ఘోరమైన, మానవత్వం నివ్వెరపోయే దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఉన్న ఒక వ్యక్తి ఆమెను దారుణంగా కొట్టి, ఉరివేసి హత్య చేయడమే కాకుండా..

ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ దృశ్యాలను వీడియో తీసి వికృతానందం పొందాడు. అంతేకాకుండా ఆమె కన్నతల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కూతురు చివరి శ్వాస విడుస్తుండగా ప్రత్యక్షంగా చూపిస్తూ రాక్షసానందం పొందాడు.

Read Also :Amarnath Yatra Bus Accident: అమర్‌నాథ్ యాత్రలో విషాదం: లోయలో పడ్డ బస్సు

అసలేం జరిగింది?

బాగల్‌కోట్ జిల్లా బిల్గి తాలూకా గలగలి గ్రామానికి చెందిన ప్రవీణ్ జిగళూర్, భాగ్యశ్రీ జిగళూర్ (23) ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రవీణ్ తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు. మనస్పర్థల కారణంగా భాగ్యశ్రీ గత రెండు నెలలుగా తన పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల భర్త ప్రవీణ్ ఇకపై గొడవపడనని, కలసి సంతోషంగా ఉందామని నమ్మబలికి ఆమెను తిరిగి తన వద్దకు రప్పించాడు. అయితే, ఆమె ఇంటికి తిరిగి వచ్చిన ఆదివారం సాయంత్రమే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం ఆమె మెడకు దుపట్టాతో ఉరివేసి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు.

లైవ్ వీడియో కాల్స్.. వీడియోగ్రాఫ్ చేసి షేర్!

హత్య చేయడంతో సరిపెట్టుకోని నిందితుడు, ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. భాగ్యశ్రీ గాలి ఆడక విలవిలలాడుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులకు నేరుగా వీడియో కాల్ చేశాడు. తమ కూతురు కళ్లముందే నరకయాతన అనుభవిస్తూ చనిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో కన్నవారు రోదించారు. ఆ తర్వాత ఆమె ఉరికి వేలాడుతూ కదులుతున్న వీడియోను వాట్సాప్ ద్వారా తన స్నేహితులు, బంధువులకు పంపి వికృతానందం పొందాడు.

Bagalkot Crime: నిందితుడి అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం

ఈ సమాచారం అందుకున్న వెంటనే బిల్గి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై, అలాగే అతను చేసిన వీడియో రికార్డింగ్‌ల ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘోర ఉదంతం కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఏం కష్టమొచ్చిందో ఏమో.. గడ్డి మందు తాగి దంపతుల బలవన్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha