Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నడిరోడ్డుపై వేటకొడవళ్లతో దారుణ హత్యకు గురైన వ్యక్తి

నడిరోడ్డుపై వేటకొడవళ్లతో దారుణ హత్యకు గురైన వ్యక్తి

వార్త 2 weeks ago

A Man killed brutally In Guntur : గుంటూరులోని కొండ వెంకటప్పయ్య (KVP) కాలనీలో పాత కక్షల కారణంగా దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానం మరియు 2006లో జరిగిన బుల్లయ్య హత్య కేసుతో పెండ్ర చిన్నా (55) అనే వ్యక్తికి, బుల్లయ్య కుటుంబానికి మధ్య తీవ్ర శత్రుత్వం ఏర్పడింది.

ప్రాణభయంతో 20 ఏళ్లుగా సూర్యాపేటలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ పరారీలో ఉంటున్న చిన్నా, శనివారం తన మేనమామ మట్టయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గుంటూరు వచ్చాడు.

Read Also: Gang Rap in Delhi : బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్

 A Man killed brutally In Guntur

A Man killed brutally In Guntur : నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు

గుంటూరులోని కెవిపి కాలనీలో నివసించే చిన్న మేనమామ మట్టయ్య, ఈ నెల 29న అనారోగ్యంతో మరణించారు. తన మేనమామకు చివరి నివాళులు అర్పించేందుకు చిన్నా శనివారం గుంటూరుకు వచ్చాడు. అతను వచ్చిన విషయం అతని ప్రత్యర్థులకు తెలిసింది. ఆదివారం ఉదయం చిన్న తన కుటుంబంతో కలిసి మేనమామ పార్థివ దేహాన్ని సందర్శించాడు. ఆ తర్వాత అల్పాహారం కోసం బయటకు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు అతన్ని వెంబడించారు. కర్రలతో కొట్టి చిన్నాను కింద పడవేసిన దుండగులు, వేట కొడవళ్లతో నరికి, కత్తులతో పొడిచారు. అతని మెడ తెగిపోవడంతో అతని మృతదేహం రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉంది. బుల్లయ్య కుమారులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ రాజేశ్​ తెలిపారు

నీట్-పీజీ పరీక్షకు ముందే ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha