Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 సవర్ల బంగారం అపహరణ!

నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి 3 సవర్ల బంగారం అపహరణ!

వార్త 2 weeks ago

Tirupati Chain Snatching: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో చైన్ స్నాచర్లు (గొలుసు దొంగలు) మళ్లీ పంజా విసిరారు. పట్టపగలే జనం తిరిగే వీధుల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

తాజాగా తిరుపతి అర్బన్ పరిధిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిమితుల్లో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also :Lucknow Crime: బలవంతంగా మద్యం తాగించి కోడలిపై మామ అత్యాచారం

అసలేం జరిగిందంటే..?

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని మునిరెడ్డి నగర్ పరిధిలో ఉన్న పి.ఎన్.ఆర్ (PNR) అపార్ట్‌మెంట్‌లో పార్వతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. అదే మునిరెడ్డి నగర్ సమీపంలోని పక్క వీధిలో నివసిస్తున్న తన కూతురి ఇంటికి పార్వతి కాలినడకన వెళ్లారు. అక్కడ కూతురిని కలిసి, తిరిగి తన అపార్ట్‌మెంట్‌కు నడుచుకుంటూ వస్తుండగా.. నిర్మానుష్యంగా ఉన్న వీధిని ఆసరాగా చేసుకుని అగంతకులు ఆమెపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. క్షణాల వ్యవధిలో ఆమె మెడలో ఉన్న 36 గ్రాముల (సుమారు 4న్నర తులాల) బంగారు చైన్‌ను బలంగా లాక్కొని అక్కడి నుంచి క్షణాల్లో బైక్‌పై పరారయ్యారు.

Tirupati Chain Snatching: రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

బాధిత మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేలోపే దుండగులు బైక్‌పై తప్పించుకున్నారు. బాధితురాలు పార్వతి వెంటనే ఈ దారుణంపై ఎస్వీ యూనివర్సిటీ (SV University) పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మునిరెడ్డి నగర్ వీధుల్లోని పలు ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. నిందితులు బైక్‌పై వచ్చి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దృశ్యాలు రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌షూటర్లు హతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha