Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నగర వాసులకు అలర్ట్‌.. 36 గంటలు నీటి సరఫరా బంద్‌!

నగర వాసులకు అలర్ట్‌.. 36 గంటలు నీటి సరఫరా బంద్‌!

వార్త 2 weeks ago

Hyderabad water supply: హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-2 పరిధిలో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నందున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వరుసగా 36 గంటల పాటు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.

Telangana Rain Alert: రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

మరమ్మతు పనుల వివరాలు

నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై అధికారులు రిపేర్లు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడితో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలకు రెక్టిఫికేషన్ పనులు నిర్వహించనున్నారు.

సమయం ఇదే
ఈ పనులు అక్టోబర్ 5న ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి.

తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే

తూర్పు జోన్‌లోని హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, పద్మారావునగర్, బేగంపేట్, ప్రకాశ్ నగర్, మేకలమండి, భోలక్పూర్, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, హస్మత్‌పేట్, లాలాగూడ, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్‌లో వాటర్ సప్లైకు అంతరాయం కలగనుంది.

దక్షిణ జోన్ పరిదిలో ఆదిభట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్ నగర్‌లో కూడా తాగునీటి సరఫరా బంద్ కానుంది.

మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి, ఆయా ప్రాంతాల ప్రజలు ముందుగానే తగినంత నీటిని నిల్వ ఉంచుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్లను ఏపీకి బహుమతిగా పంపిస్తున్నాడు: కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha