Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్ రెడ్డి  తెలంగాణ నీళ్లను ఏపీకి బహుమతిగా పంపిస్తున్నాడు: కవిత

రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్లను ఏపీకి బహుమతిగా పంపిస్తున్నాడు: కవిత

వార్త 2 weeks ago

Kavitha: తెలంగాణ జలాలను గిఫ్ట్ ప్యాక్ చేసి మరీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి పంపిస్తున్నారంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా నది జలాలను పొరుగు రాష్ట్రంలోని కుప్పం ప్రాంతానికి తరలిస్తున్నారని, కానీ మన మహబూబ్‌నగర్ జిల్లా రైతన్నలకు మాత్రం చుక్క నీరు కూడా దక్కడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన కాలంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుపై కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే నేడు రాష్ట్రం తీవ్ర కరవుతో అల్లాడిపోతోందని విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు: కవిత ధ్వజం

ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, ప్రభావిత మండలాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా, కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ కరవు మండలాలను ప్రకటించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లోపాన్ని తేటతెల్లం చేస్తోందని ఎత్తిచూపారు.

read also: Hyderabad Cyber Crime: 'చుట్టమల్లే' ఏఐ మార్ఫింగ్ వీడియో.. హైదరాబాద్‌లో కేసు నమోదు

Kavitha: నార్లాపూర్ రిజర్వాయర్‌పై నిర్లక్ష్యం వల్లనే నీటి కటకట: పాలమూరు ప్రాజెక్టుపై విమర్శలు

“నార్లాపూర్ రిజర్వాయర్‌పై కొంతైనా నిధులు ఖర్చు చేసి ఉంటే, ఈరోజు దాన్ని నింపుకొని కల్వకుర్తి ఆయకట్టుకైనా సాగునీరు అందించే అవకాశం ఉండేది. దానివల్ల భూగర్భ జలాలు కూడా మెరుగయ్యేవి” అని కవిత అభిప్రాయపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ.. పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రతిష్టాత్మక ఎత్తిపోతల పథకాలను నింపకుండా మన నీటిని ఏపీకి తరలించేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

విద్యుత్ కోతలు మరియు తాగునీటి ఎద్దడిపై రేవంత్ రెడ్డికి నిలదీత

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 6 నుంచి 7 గంటల కోతలతోనే సరిపెడుతోందని కవిత మండిపడ్డారు. విద్యుత్ కోతల వైఫల్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం వ్యవసాయ రంగమే కాకుండా, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కరవుతో నష్టపోతున్న రైతులు, ప్రజలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రాష్ట్రంలోని 60 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేస్తారని ఆమె భరోసా కల్పించారు.

Epaper: epaper.vaartha.com

నగర ప్రజలకు కొత్త మున్సిపల్ సేవలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha