CM Revanth reddy:హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రతి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Read also: Rajanna sircilla news: 'మోదీనే నా చావుకు కారణం' అంటూ యువకుడు ఆత్మహత్య
CM reviews city development works
భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశాకే టెండర్లు
నగరంలో చేపట్టే ఏ నూతన ప్రాజెక్టుకైనా ముందుగా భూసేకరణ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లు వెల్లడించారు. భూ సమస్యలు పరిష్కారం అయిన తర్వాతే టెండర్లు పిలవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth reddy:సైబరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు
సైబరాబాద్ పరిధిలో తలపెట్టిన మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. అదేవిధంగా ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. నగర సౌందర్యానికి భంగం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులు వేగంగా ముగించాలని పేర్కొన్నారు.
Epaper: epaper.vaartha.com

